అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యం

ఢిల్లీ: రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో వివేక్ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో కలిసి JP నడ్డాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక అంటేనే రోడ్లు వేయిస్తున్నారని తెలిపారు. TRS పార్టీలోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారని.. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లడలేదన్నారు. మార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందన్న రాజగోపాల్ రెడ్డి.. నైతికంగా రాజీనామ చేసి పార్టీ మారాను .. ఇది తప్పా? అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను తెరపైకి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీయే అని చెప్పారు. సీఎం కేసీఆర్ ఏనాడూ అపాయింట్ మెంట్ ఇవ్వరన్న ఆయన.. మంత్రులు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. ప్రజా సమస్యలు వినరు అని తెలిపారు. ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని.. ప్రొటోకాల్ ఎక్కడా ఫాలో అవ్వలేదన్నారు. చౌటుప్పల్ లో సమావేశం ఏ తరహాల్ పెట్టాలో నిర్ణయిస్తామని.. మూడున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేశానో ప్రజలు చూశారని చెప్పారు. 

అమిత్ షాను కలవగానే గట్టుపల్లిని మండలంగా మార్చారని.. వ్యాపారాలు, కాంట్రాక్టులు, డబ్బులే ముఖ్యమంటే టీఆర్ఎస్ లోనే చేరేవాళ్లమని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ లో చేరాలని గతంలోనే ఆహ్వానం అందిందని.. కానీ ఆ పార్టీ అంటే నాకు ఇష్టం లేదన్నారు. తెలంగాణ కోసం వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని .. వెంకట్ రెడ్డి గురించి అద్దంకి దయాకర్ దారుణంగా మాట్లాడారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని గాలికొదిలేశారన్న రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధనలో జైలుకి వెళ్లారా.. ఓటుకు నోటు కేసులో వెళ్లారా అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. నాపై ఒక్క కేసు కూడా లేదని.. మమ్మల్ని కోమటిరెడ్డి బ్రదర్స్ గానే గుర్తిస్తారని.. మమ్మల్ని వాడుకుని సీఎం అవ్వాలన్న రేవంత్ ప్లాన్ పారలేదని తెలిపారు. రేవంత్ .. ఆయన సైన్యం దొంగల ముఠాగా మారి మాపై నిందలు వేస్తున్నారని తెలిపారు. ఇది ధర్మయుద్ధం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రేవంత్ వచ్చాక కాంగ్రెస్ మరింత పతనమయ్యిదని చెప్పారు.