కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • జనరల్ బాడీ మీటింగ్ లో సభ్యుల ఆగ్రహం
  • నిధులు ఇవ్వలేదని అధికార పార్టీ ఎంపీటీసీల బాయ్​కాట్

వెల్గటూర్, వెలుగు : మూడు నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్ కు అధికారులు, అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కాకపోతే సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని బీజేపీ స్టేట్​లీడర్, ఎండపల్లి ఎంపీటీసీ ఎండీ బషీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో శనివారం ఎంపీపీ కూనమల్ల లక్ష్మి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. మీటింగ్​కు కేవలం ఏడుగురు సర్పంచ్ లు, నలుగురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారన్నారు. గైర్హాజరైన అధికారులపై, సర్పంచులు, ఎంపీటీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవరావు, తహసీల్దార్​రమేశ్, రాజారాంపల్లి ఎంపీటీసీ లు గాజుల మల్లేశం, ముస్కు కవిత, నక్క పూజిత, సర్పంచ్ లు కొమ్ము రాంబాబు, మెరుగు మురళి, అధికారులు పాల్గొన్నారు.

ఎంపీటీసీల బాయ్ కాట్..

అధికార పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు జనరల్ బాడీ మీటింగ్ ను బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర ఏళ్లు గడిచినా గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్‌‌ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. 

ఎన్నికల వాగ్దానాలపై చర్చకు సిద్ధమా?

జగిత్యాల, వెలుగు : గత ఎన్నికలలో టీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన వాగ్దానాల అమలుపై జగిత్యాలలోని అంబేద్కర్​విగ్రహం ముందు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్చకు సిద్ధమా అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణహరి, జిల్లా అధికార ప్రతినిధి సత్యం సవాల్ విసిరారు. శనివారం జగిత్యాలలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో  వారు మాట్లాడారు. ఎంపీ పసుపుబోర్డు స్థానంలో పసుపుతో సహా మిగతా సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన స్పైస్ బోర్డు తెచ్చారని, దీనివల్ల రైతులకు చాలా మేలు జరిగిందన్నారు. మాజీ ఎంపీ కవిత తాను గెలిచిన 100 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాట తప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమావేశం లో బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, రాజేందర్, రాజేందర్ రావు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

జగిత్యాల, వెలుగు: ఎమ్మెల్యేకు, తమకు ఎలాంటి విభేదాలు లేవని, అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఇటీవల బీజేపీలోకి మారుతారని వచ్చిన అరోపణలపై ఆమె స్పందించారు. శనివారం జగిత్యాల బల్దియాలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్షాల్లో కొంతమంది మేం చేసే అభివృద్ధిని చూసి  ఓర్వలేక పార్టీ ఫిరాయిస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగిత్యాల అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పని చేస్తున్నారని, ఆయన సారథ్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది అభివృద్ధి పనుల్లో పాల్గొనకపోతే.. పార్టీ మారుతారని అరోపణలు చేస్తారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారం తో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

‘ఖాదీ భూములపై ఎంక్వైరీ చేయాలి’ 

మెట్ పల్లి, వెలుగు :  చేనేత కార్మికులకు ఆసరా కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెట్ పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ లో అవకవతవలు జరుగుతున్నాయని, సెంట్రల్ విజిలెన్స్ ద్వారా తనిఖీ చేయించాలని మెట్ పల్లి టౌన్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొడ్ల రమేశ్​డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అభివృద్ధి మరచి స్వలాభం చేకూర్చే పనులే చేపడుతున్నారని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల తరహాలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు అల్ఫోర్స్ స్టూడెంట్స్ ఎంపిక

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాస్థాయి వాలీబాల్​పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు ఎంపికవడం అభినందనీయమని చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వావిలాలపల్లిలోని స్కూల్ ఆఫ్‍ జెన్ నెక్స్ట్ లో నిర్వహించిన అభినందన సభలో ఎంపికైన విద్యార్థులను చైర్మన్ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు ఇష్టమైన క్రీడల్లో రాణించాలన్నారు. ఆజాదీకా అమృత్​మహోత్సవ్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు ఎంపికయ్యారని వెల్లడించారు. అండర్17 బాలికల విభాగంలో బి.శ్రీహిత, సిరిచందన, శ్రీ సంజన, కృషిక, శ్రీవిద్య, మనుశ్రీ, బి.శివాత్మిక, డి. హంసిని, కె. అక్షయ ఎంపికయ్యారని హర్షం వ్యక్తం చేశారు. నైపుణ్యం, అనుభవం కలిగిన వ్యాయామ టీచర్లతో శిక్షణను ఇప్పించడంతో సునాయస విజయాలు అల్ఫోర్స్ సొంతమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 

అన్ని పండుగల్లో ముగ్గులకే ప్రాధాన్యత

కరీంనగర్ సిటీ, వెలుగు: పండుగలు ఏవైనా ఇంటిముందు అందంగా ముగ్గులు వేయడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలో అంబేడ్కర్ స్టేడియంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం రామడుగు మండలం, వెలిచాల గ్రామానికి చెందిన జె. నిర్మలకు మొదటి బహుమతి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన  కస్తూరి స్వరూప రెండో బహుమతి, జిల్లా కేంద్రానికి చెందిన ఎం. లక్ష్మి, అక్షయకు మూడో బహుమతి ప్రదానం చేశారు. 

చొప్పదండి: వజ్రోత్సవాల సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో, మండలంలోని పెద్దకురుమపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్​పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్, కౌన్సిలర్లు, పెద్దకురుమపల్లి సర్పంచ్​గంగమల్లయ్య, ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

జమ్మికుంట: వజ్రోత్సవాల సందర్భంగా  మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్​రావు, వైస్​ చైర్​పర్సన్​ ​స్వప్న, కమిషనర్​ సమ్మయ్య అధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలలో సుమారు 150 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. 
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ముందు శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. అనంతరం విజేతలుగా నిలిచిన స్వరూప, శ్రీలత, కోమలత, నిఖితకు బహుమతులు అందించారు. కరీంనగర్ సిటీ, వెలుగు: పండుగలు ఏవైనా ఇంటిముందు అందంగా ముగ్గులు వేయడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలో అంబేడ్కర్ స్టేడియంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం రామడుగు మండలం, వెలిచాల గ్రామానికి చెందిన జె. నిర్మలకు మొదటి బహుమతి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన  కస్తూరి స్వరూప రెండో బహుమతి, జిల్లా కేంద్రానికి చెందిన ఎం. లక్ష్మి, అక్షయకు మూడో బహుమతి ప్రదానం చేశారు. 

చొప్పదండి: వజ్రోత్సవాల సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో, మండలంలోని పెద్దకురుమపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్​పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్, కౌన్సిలర్లు, పెద్దకురుమపల్లి సర్పంచ్​గంగమల్లయ్య, ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

జమ్మికుంట: వజ్రోత్సవాల సందర్భంగా  మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్​రావు, వైస్​ చైర్​పర్సన్​ ​స్వప్న, కమిషనర్​ సమ్మయ్య అధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలలో సుమారు 150 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. 

కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ముందు శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. అనంతరం విజేతలుగా నిలిచిన స్వరూప, శ్రీలత, కోమలత, నిఖితకు బహుమతులు అందించారు. 

ప్రతి ఇల్లు భారతమాతకు పుట్టినిల్లే

జగిత్యాల, వెలుగు: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని  ప్రతి ఇల్లు భారత మాతకు పుట్టినిల్లుగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరైన వసంత.. బల్దియా చైర్ పర్సన్ భోగ శ్రావణితో కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన మహనీయులను స్మరించుకునేలా సీఎం కేసీఆర్​కార్యక్రమాలు చేపట్టారని, ముగ్గులు మన సంస్కృతికి ప్రతీకగా అభివర్ణించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ, ఆర్డీఓ మాధురి పాల్గొన్నారు.

టూ వీలర్ పై 32 చలాన్లు

జగిత్యాల, వెలుగు : జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన లింగయ్య అనే వ్యక్తి టూ వీలర్ పై 32 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉండటంతో ట్రాఫిక్​పోలీసులు జరిమానా కట్టించారు. శనివారం జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తుండగా లింగయ్య బైక్​(టీఎస్ 03 ఈజీ 0399)ను తనిఖీ చేసి 32 చలాన్లు ఉండటంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సై రాము చలాన్లకు సంబంధించిన రూ.5,750 ఫైన్ ను కట్టించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.