మళ్లీ తెరపైకి పోచమ్మ స్థలం ఇష్యూ .. పోచమ్మ గుడి పక్కనున్న నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు

మళ్లీ తెరపైకి పోచమ్మ స్థలం ఇష్యూ .. పోచమ్మ గుడి పక్కనున్న నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు
  • 1968లో రామగుండంలో సింగరేణి సంస్థ 8.2ఎకరాల భూ సేకరణ
  • ఈ స్థలంలోని 39 గుంటల్లో అక్రమ నిర్మాణాలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాకు సమీపంలోని పోచమ్మ మైదానం స్థలం మళ్లీ తెరపైకి వచ్చింది. 1968లో సింగరేణి తన అవసరాలకు జనగామ గ్రామ శివారులోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 693లో 8.2 ఎకరాలు సేకరించింది. ఆ తర్వాత కార్మికుల కోసం పోచమ్మ గుడి పక్కన 39 గుంటల స్థలంలో కూరగాయల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. కాగా ఈ స్థలం సింగరేణి పేరున రిజిస్ట్రర్​కాకపోవడంతో ఆ భూమి యజమానికి చెందిన వారసులు దానిని అమ్మారు. ఆ భూమిని కొన్నవారు కొందరు నిర్మాణాలు చేపట్టారు.  కాగా స్థలం విషయంలో అసలైన ఓనర్లను తేల్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు.  ఈ నెల 21న 683, 693, 694 సర్వే నంబర్లలో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని, ఓనర్లు అందుబాటులో ఉండాలని నోటీసులు జారీ చేసింది. 

8.2 ఎకరాల భూ సేకరణ

సింగరేణి మైనింగ్, ఇతర అవసరాల కోసం అప్పటి జనగామ శివారులోని సర్వే నెంబర్​ 693లో 8.2 ఎకరాల భూమిని 1968లో సేకరించింది. దీనికి సంబంధించి రూ.23,392 పరిహారం చెల్లించింది. దీనికి సంబంధించి రసీదులు ఉన్నట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా ఇదే సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 39 గుంటలకు సంబంధించిన పట్టాదారు తమకు ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్​ చేయలేదని 1975లో సింగరేణి అప్పటి సుల్తానాబాద్ కోర్టును ఆశ్రయించడంతో వాదనలు తర్వాత ఆ భూమి సింగరేణికి చెందుతుందని డిక్రీ జారీ చేసింది. అయినప్పటికీ ఈ స్థలాన్ని సింగరేణి తన పేరుపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయింది. 

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం

సింగరేణి తన ఆధీనంలోని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించగా.. 2007లో అందులోని 150 దుకాణాలు తొలగించి రామగుండం బల్దియా పరిధిలో షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మాణం చేపట్టారు. అప్పటివరకు సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పట్టాదారుల వారసులు 693 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ స్థలం సింగరేణిదే అంటూ తీర్పులు వచ్చాయి. వివాదం కోర్టులో ఉండగానే పట్టాదారుకు సంబంధించిన వ్యక్తులు ఇతరులకు ఆ స్థలాన్ని అమ్మగా, కొన్నవారు నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకున్నారు. అప్పటి ఓ మున్సిపల్​ ఆఫీసర్​ఈ అనుమతులు, ట్రేడ్​ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకురావడంలో కీలకంగా పనిచేశారని, ఇందుకు  ఆయనకు భారీగా నజరానాతో పాటు ఓ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు షాపింగ్​కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా నిర్మించిన ముగ్గురికి చెందిన మూడు నిర్మాణాలను కార్పొరేషన్​ యంత్రాంగం రెండు నెలల కింద 
కూల్చేసింది. 

నోటీసులతో బిల్డింగ్​ ఓనర్లలో బుగులు 

రెవెన్యూ అధికారుల నోటీసులతో పోచమ్మ మైదానంలోని భూమిని కొని బిల్డింగులు నిర్మించుకున్న ఓనర్లలో బుగులు మొదలైంది. తాము లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే స్థలం కొన్నామని, ఇప్పుడు సర్వే, హద్దులు నిర్ణయించే పేరుతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడమేంటని ఆందోళన 
చెందుతున్నారు.