వర్షాకాలం అయిపోయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే పడిన వాన

వర్షాకాలం అయిపోయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే పడిన వాన

వర్షాకాల సీజన్ ముగిసిందని ఐఎండీ ప్రకటించింది.  గతంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి వర్షాలు ఎక్కువే పడ్డాయని వెల్లడించింది.  తెలంగాణలో 962.6 మి.మీ వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది వాతావారణ శాఖ.  తెలంగాణలో అక్టోబర్ 15 వరకు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.  తుఫాన్లు వస్తేనే వర్షాలు పడే అవకాశం ఉంది కానీ.. సాధారణ వర్షాలు కురిసే అవకాశం లేదని వెల్లడించింది ఐఎండీ.

2024 రుతు పవనాల సీజన్‌లో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

2020 తర్వాత అధిక వర్షపాతం

ఈ సారి దేశంలో  934.8 మిమీ వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది ఐఎండీ. సాధారణం కంటే 7.6 శాతం ఎక్కువ వర్షపాతంత  నమోదయ్యింది వెల్లడించింది    2023 రుతుపవనాల సీజన్‌లో  820 మిమీ,  2022లో 925 మిమీ, 2021లో 870 మిమీ, 2020లో 958 మిమీ వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది ఐఎండీ.