IMDb Most Anticipated Movies: ఇండియాలోనే నెం.1..'పుష్ప 2'.. దేవర ఎన్నో స్థానం అంటే? IMDB జాబితా ఇదే

IMDb Most Anticipated Movies:  ఇండియాలోనే నెం.1..'పుష్ప 2'.. దేవర ఎన్నో స్థానం అంటే? IMDB జాబితా ఇదే

ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా 2024లో ఇండియన్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాను ప్రకటించింది.

ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa the Rule) చిత్రం అగ్ర స్థానంలో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'దేవర 1' మూవీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా చియాన్ విక్రమ్ హీరోగా, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' మూవీ 8వ స్థానంలో నిలిచింది.

Also Read :- జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది

ఎంతోగాను ఎదురుచూస్తున్న 10 సినిమాల జాబితా

పుష్ప ది రూల్

దేవర పార్ట్ 1
వెల్ కం టూ జంగిల్ 
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
కంగువ
సింగం ఎగైన్ 
భూల్ భూలయ్యా 3
తంగలన్
ఔరోన్ మే కహన్ దమ్ థా
స్ట్రీ 2
 

      We can’t keep calm! Here are the Most Anticipated Upcoming Indian Movies of 2024! 🙌

ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్తో  అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా..ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనం ఇస్తూ..ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.