తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి

బెల్లంపల్లి రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్​ గోవర్దన్​ డిమాండ్ ​చేశారు. బుధశారం నెన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 5 నియోజకవర్గాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. 

కాళే శ్వరం ప్రాజెక్టు కట్టిన నాలుగేండ్లకే కూలిందని, అక్కడి నుంచి నీరు శాశ్వతంగా వచ్చే అవకాశం లేదని.. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాకు తుమ్మడిహెట్టి ప్రాజెక్టు తప్పా మరే గత్యంతరం లేదన్నారు. ప్రభుత్వం  ఇప్పటికైనా స్పందించి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని డిమాండ్​ చేశారు. సీపీఐ ఎంఎల్ ​జిల్లా కార్యదర్శి లాల్ ​కుమార్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మంగ, ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ ​జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి, పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.