పాకిస్థాన్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 13న పెషావర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. విదేశీ కుట్రతో ప్రధాని పీఠం నుంచి దిగాక.. ఇది తన మొదటి సమావేశమని ట్వీట్ చేశారు. ఈ సభలో ప్రజలందరూ పాల్గొనాలన్నారు. పాకిస్థాన్ స్వతంత్ర, సార్వభౌమ దేశంగా ఉందన్నారు. న్యాయపరంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ప్రధానిని ఎన్నుకునే హక్కు కల్పించేందుకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని.. ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. నిష్పక్షపాతంగా ప్రధానిని ఎన్నుకునేందుకు అవకాశం ప్రజలకు కల్పించాలని.. అన్నారు ఇమ్రాన్ ఖాన్.
We are demanding immediate elections as that is the only way forward -- to let the people decide, through fair & free elections, whom they want as their prime minister.
— Imran Khan (@ImranKhanPTI) April 11, 2022