- ఫోన్ మాట్లాడుతూ వాటర్ హీటర్ చంకలో పెట్టుకున్న మహేశ్
- ఖమ్మంలో కాల్వొడ్డులో ఘటన
ఖమ్మం టౌన్, వెలుగు: కరెంట్ షాక్‌తో ఆదివారం రాత్రి ఖమ్మంలోని కాల్వొడ్డుకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి దోనెపూడి మహేష్ బాబు(32) చనిపోయాడు. ఆదివారం రాత్రి తన పెంపుడు కుక్కకు వేడినీళ్లతో స్నానం చేయించేందుకు వాటర్ హీటర్ ఆన్ చేసిన మహేశ్ ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంలో చంకలో హీటర్ పెట్టుకున్నాడు. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మహేశ్‌కు సీపీఆర్చేసినా ఫలితం కనిపించలేదు. 108లో దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మృతుడికి భార్య దుర్గాదేవి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.