మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ 

బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని మమ్మల్ని సంప్రదించినా బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా టీఆరెస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా ..మూడో స్థానానికి పోతుందని జోస్యం చెప్పారు.

రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి గ్లో వచ్చినా, అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. అటు దేశలోనైనా.. ఇటు రాష్ట్రంలోనైనా రాజకీయంగా బీజేపీని వ్యతిరేకిస్తామన్న తమ్మినేని... ఇప్పుడున్న పరిస్థితిలో మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.

మేము తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఒక్క మునుగోడు ఉపఎన్నిక  విషయంలో మాత్రమేనని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన సమస్యలపై పోరాటాలు ఆగవని... శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిసి రాష్ట్ర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని  తమ్మినేని వీరభద్రం తెలిపారు.