లైట్స్​ ఏర్పాటు చేయలేదని.. సిబ్బందిని బంధించిన వార్డు ప్రజలు

లైట్స్​ ఏర్పాటు చేయలేదని.. సిబ్బందిని బంధించిన వార్డు ప్రజలు

వేములవాడ, వెలుగు : వేములవాడ మున్సిపల్​పరిధిలోని 6వ వార్డులో సోమవారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మకు మున్సిపల్​ సిబ్బంది లైట్లు అమర్చలేదనే కోపంతో వార్డుకి వచ్చిన ఇద్దరు మున్సిపల్​ సిబ్బందిని ఆదివారం స్థానికుల గదిలో నిర్బంధించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా సాలరామన్నపల్లిలో  లైట్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని వార్డు ప్రజలు సిబ్బందిని ప్రశ్నించారు. దీనికి వారు ఒకింత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఓ రూమ్ లో బంధించారు.

తర్వాత అధికారులకు విషయం చెప్పినా స్పందించకపోవడంతో కొద్దిసేపటికి వదిలేశారు. పెద్ద పండుగైన బతుకమ్మకు లైట్స్​ఏర్పాటు చేయకపోవడం ఏమిటని, వెంటనే ఆ పని చేయాలని డిమాండ్​ చేశారు.