చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్​మరోసారి వాయిదా

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్​మరోసారి వాయిదా

సికింద్రాబాద్, వెలుగు: అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్, స్టేషన్ రెండో ఎంట్రీ గేట్​ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది నవంబర్​7న చర్లపల్లి టెర్మినల్​ను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. పనులు పూర్తికాకపోవడంతోపాటు కనెక్టివిటీ రోడ్డు విషయంలో నెలకొన్న వివాదంతో ఓపెనింగ్​ను ఈ నెల 28కు పోస్ట్​పోన్​చేశారు. 

తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​మృతికి నివాళి అర్పిస్తూ కేంద్రం వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది. దీంతో శనివారం జరగాల్సిన చర్లపల్లి రైల్వే టెర్మినల్​ప్రారంభోత్సవం వాయిదా పడింది. సంతాప దినాల అనంతరం ప్రారంభ తేదీని ప్రకటిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.