మెల్‌బోర్న్: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 26న మొదలయ్యే ఈ మ్యాచ్‌కు సంబంధించిన తొలి రోజు టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ‘పబ్లిక్‌కు అందుబాటులో ఉన్న తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ నెల 24న మరికొన్ని టికెట్లను అమ్మకానికి పెడతాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
ఈ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వనున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం లక్ష. మ్యాచ్‌కు 15 రోజుల టైమ్ ఉన్నా అప్పుడే ఫస్ట్ డే టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఇండో–ఆసీస్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ను చూపెడుతోంది. ఇక పింక్ బాల్ టెస్టుకు మూడు రోజుల్లో 1,35,012 మంది హాజరయ్యారు. ఓవరాల్‌గా 2014–15లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య (1,13,009 మంది) పోలిస్తే ఇది కొత్త రికార్డు.