ఇండియా–ఆస్ట్రేలియా సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే వన్డేల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుదే అధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 146 వన్డేలు ఆడగా ఆస్ట్రేలియా 82, భారత్ 54 మ్యాచ్‌లు గెలిచాయి.
భారత్‌లో 67 మ్యాచ్‌లు ఆడగా, ఆసీస్ 32 మ్యాచ్‌లు గెలవగా, టీమ్ ఇండియా 30 మ్యాచ్‌లు గెలిచింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ఇక మొహాలీ స్టేడియం ఇప్పటి వరకు 26 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది, ఇందులో 15 మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా, 11 మ్యాచ్‌లు ఛేజింగ్ చేసిన జట్టు గెలిచింది. మొహాలీలో ఆస్ట్రేలియాతో ఆడిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారత్ ఓడిపోయింది.
ALSO READ : ప్రపంచంలోనే గొప్ప లీడర్ మోదీ : వివేక్ వెంకటస్వామి
మొహాలీలో నాలుగేళ్లుగా వన్డే మ్యాచ్ జరగలేదు. ఐపీఎల్‌లో మాత్రం కొన్ని భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా ఇక్కడ 2019లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
జట్ల (అంచనా):
ఇండియా: రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, గిల్, శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, సుందర్, అశ్విన్, షమీ, సిరాజ్ / శార్దూల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, స్టోయినిస్, స్పెన్సర్ జాన్సన్ / తన్వీర్ సంగా, ఆడమ్ జంపా, హాజిల్‌వుడ్.