World Cup 2023 Final: టాస్ సెంటిమెంట్.. 1983, 2011 చరిత్ర రిపీట్ కానుందా!

World Cup 2023 Final: టాస్ సెంటిమెంట్.. 1983, 2011 చరిత్ర రిపీట్ కానుందా!

సాధారణంగా నాకౌట్  మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతారు. మొదట బ్యాటింగ్ చేసి సరైన లక్ష్యం నిర్ధేశించగలిగితే.. ప్రత్త్యర్ధి జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చనేది వ్యూహం. అయితే, ఇండియాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది. 

రాత్రి సమయంలో మంచు పడే అవకాశం ఉంది. ఈ కారణంతోనే కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒకవేళ ఆసీస్ కెప్టెన్ చెప్పినట్లు మంచు కురిస్తే బౌలర్లకు పట్టు దొరకదు. అది ఆసీస్‌కు లభిస్తుంది. అయితే, రోహిత్ శర్మ మాత్రం టాస్ గెలిచినా తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని తెలపడం గమనార్హం.

1983, 2011లో టాస్ ఓడినా.. విజయం మనదే

వన్డే ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా ఇప్పటివరకూ నాలుగు సార్లు(1983, 2003, 2011, 2023) ఫైనల్‌ చేరగా.. రెండింట విజయం సాధించింది. గెలిచిన ఈ  రెండు మ్యాచ్‌ల్లోనూ భారత కెప్టెన్లు టాస్ ఓడారు. తొలిసారి 1983లో కపిల్‌ సేన తొలుత టాస్‌ ఓడినా.. ఫైనల్‌లో విండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. అనంతరం మరోసారి 2011లో ధోనీ సేన శ్రీలంకపై టాస్ ఓడినప్పటికీ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.