
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ ప్లేయర్లను ఇండియా–ఎ జట్టులో ఆడించేందుకు సెలెక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. మే– జూన్ మధ్య ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండు నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో వీళ్లు బరిలోకి దిగనున్నారు. జూన్ 20న హెడింగ్లీలో జరిగే తొలి టెస్ట్‌తో ఇండియా తమ 45 రోజుల ఇంగ్లండ్ టూర్‌ను ప్రారంభిస్తుంది.
2024–25 రంజీ సీజన్‌లో దుమ్మురేపిన కరుణ్ నాయర్‌ను ఇండియా–ఎ జట్టులోకి తీసుకోనున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల్లో టీమిండియా ఓడటంతో విమర్శలు ఎదురైనా ఇంగ్లండ్ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించే చాన్స్ ఉంది. స్టార్ పేసర్ బుమ్రా ఫిట్‌నెస్‌ను కూడా బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోంది.