భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం 5 టీ20 ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికీ 3 టీ20లు జరిగితే మొదటి రెండు మ్యాచ్ లను భారత్ గెలవగా.. నిన్న గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లకు ఆసీస్ నిన్న జట్టును ప్రకటించగా.. తాజాగా భారత్ జట్టును ప్రకటించేశారు. జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్ ను అదనంగా స్క్వాడ్ లోకి చేర్చారు.
2022 డిసెంబర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మంగళవారం(నవంబర్ 28) గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్ లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న చాహర్ సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇక చివరి రెండు టీ 20లకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడని బీసీసీఐ సిరీస్ కు ముందే తెలిపింది. వైస్ కెప్టెన్ గా అయ్యర్ టీమిండియా బాధ్యతలను చేపడతాడు.
Deepak Chahar included in the T20I team for the Australia series. pic.twitter.com/ZrnuhV18I0
— Johns. (@CricCrazyJohns) November 28, 2023
మూడో టీ20కి ముందు పేసర్ ముఖేష్ కుమార్ పెళ్లి కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. అయితే డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో జరగనున్న నాలుగో టీ20కి ముందు ఈ బెంగాల్ పేసర్ జట్టులో చేరనున్నాడు. ముఖేశ్ కుమార్ స్థానంలో ఆవేశ ఖాన్ నిన్న జరిగిన మూడో టీ20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ లో భారత్2-1 ఆధిక్యంలో ఉంది డిసెంబర్ 1న నాలుగో టీ20, డిసెంబర్ 3న 5 వ టీ20 జరుగుతాయి.
Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities.
— BCCI (@BCCI) November 28, 2023
He will join the squad ahead of the…