సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. గెబార్హ వేదికగా సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు.. సఫారీ బౌలింగ్ ధాటికి కుదేలయ్యారు. తొలి టీ20 లో చూపించిన ఊపును రెండో టీ20లో కొనసాగించలేకపోయారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 39 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లోనే తొలి మ్యాచ్ సెంచరీ హీరో సంజు శాంసన్ డకౌటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ అభిషేక్ శర్మ 4 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (4) కూడా ఔట్ కావడంతో భారత్ 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఒక సిక్సర్, ఒక ఫోర్ తో 20 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన తిలక్.. మిల్లర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు ఔటయ్యాడు. అక్షర్ పటేల్ (27), రింకూ సింగ్ (9) వెంట వెంటనే ఔట్ కావడంతో భారత్ 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి నాలుగు ఓవర్లలో హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోర్ 124 పరుగులకు చేరుకుంది. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కొయెట్జ్, పీటర్, మార్కరం, ఆండిలే సిమెలన్ తలో వికెట్ పడగొట్టారు.
Hardik's 39 at the death give India something to bowl at 🇮🇳
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2024
🔗 https://t.co/WDKY1VGUB1 | #SAvIND pic.twitter.com/NgJ1p5gtZT