గత ఆరేళ్లలో డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి .. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు : సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గత ఆరేళ్లలో డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి .. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు : సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇంకో రెండేళ్లలో వీటి విలువ రూ.8.40 లక్షల కోట్లకు
  • పెరిగిన 5జీ, ఐఓటీ, ఏఐ వాడకం.. పుట్టుకొస్తున్న డేటా
  • ఇండస్ట్రీకి మద్దతుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలసీలు
  • ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా డేటా సెంటర్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. గత ఆరేళ్లలో  60 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5 లక్షల కోట్ల) ను ఆకర్షించింది.  ఇంకో రెండేళ్లలో డేటా సెంటర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.4 లక్షల కోట్ల) ను దాటుతుందని  రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ అంచనా వేస్తోంది. ‘ఇండియా డేటా సెంటర్  సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, రియల్  ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 

విస్తరిస్తున్న ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి’ అని సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ పేర్కొంది. మహారాష్ట్ర,  తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెస్ట్ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలు ఎక్కువ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించగలిగాయి. అదానీకనెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ నెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీసీఎస్ వంటి ఇండియన్ కంపెనీలతో పాటు, మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిస్కో వంటి గ్లోబల్ కంపెనీలు ఇండియా డేటా సెంటర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. 

ఇంటర్నెట్ వాడకంతో పెరుగుతున్న డేటా

  ఇండియాలో 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఓటీ), ఏఐ వంటి కొత్త టెక్నాలజీ వాడకం పెరుగుతోంది. దీంతో డేటా భారీగా క్రియేట్ అవుతోంది.  డేటా సెంటర్లకు డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో డేటా సెంటర్ సెక్టార్ విస్తరిస్తోంది.   బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ కంపెనీలు, టెలికం కంపెనీల   నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని  సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ  సౌత్ ఇండియా, ఈస్ట్ ఏషియా సీఈఓ అన్షుమన్ మగాజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

 సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ  రిపోర్ట్ ప్రకారం, ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ  ఈఏడాది చివరి నాటికి 1,600 మెగావాట్లకు, వచ్చే ఏడాది చివరినాటికి 2,070 మెగావాట్లకు పెరుగుతుంది.  కంపెనీలు ముంబై, చెన్నై, ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెంగళూరులలో  డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇండియాలో ఏర్పాటైన డేటా సెంటర్లలో 90 శాతం ఈ సిటీలలోనే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో 47 మెగావాట్ల  కెపాసిటీ గల డేటా సెంటర్లు ఉన్నాయి.

Also Read:-ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్ లైన్ చెల్లింపులు..

 ఇంకో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా, ప్లానింగ్ స్టేజ్‌‌‌‌లో 38 మెగావాట్లు ఉన్నాయి. సిటీలో మైక్రోసాఫ్ట్‌‌‌‌ తన డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి ల్యాండ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. కాగా, ఇండియాలోనే జనరేట్ అయ్యే డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలని ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. దీనికి తోడు డ్రాఫ్ట్  డేటాసెంటర్ పాలసీ ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది.