పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా అర్జెంటీనాతో ముగిసిన మ్యాచ్ ను భారత్ డ్రా చేసుకుంది. పూల్ బి లో జరిగిన ఈ మ్యాచ్ 1-1 తో మ్యాచ్ డ్రా గా ముగిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి భారత జట్టును ఆదుకున్నాడు. మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో 58 వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ ను సమం చేశాడు. అంతకముందు లూకాస్ మార్టినెజ్ 22వ నిమిషంలో గోల్ వేసిఅర్జెంటీనాకు ఏకైక గోల్ అందించాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
తొలి మ్యాచ్ లో 3-2 తేడాతో న్యూజిలాండ్ ను భారత్ ఓడించింది. హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. పూల్ బి లో బెల్జియం ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తన చివరి మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. మంగళవారం (జూలై 30) ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడుతుంది. ఒక్కో పూల్ నుంచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
India vs Argentina Hockey Paris Olympics 2024 HIGHLIGHTS: IND 1-1 ARG
— India Insight (@PowerGrid217293) July 29, 2024
In a thrilling encounter at the Paris Olympics 2024, the Indian men's hockey team played to a 1-1 draw against Argentina. Both teams showcased exceptional skill and determination, with India securing their… pic.twitter.com/xt9BFbVUp7