యూఎస్‌‌‌‌‌‌‌‌కు మన ఎగుమతులు రూ.5.16 లక్షల కోట్లు

యూఎస్‌‌‌‌‌‌‌‌కు మన ఎగుమతులు రూ.5.16  లక్షల కోట్లు
  •  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.57 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: అమెరికాకు చేస్తున్న ఇండియా  ఎగుమతులు  కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59.93 బిలియన్ డాలర్ల (రూ.5.16 లక్షల కోట్ల) కు పెరిగాయి.  ఏడాది ప్రాతిపదికన 5.57 శాతం వృద్ధి నమోదైంది. ఇండియాలో తయారైన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు  యూఎస్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరిగింది. ఒక్క డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఈ దేశానికి  7 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేశాం. 2023, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 8.49 శాతం వృద్ధి నమోదైంది. మరొవైపు కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్ నుంచి ఇండియా చేసుకున్న దిగుమతులు 1.91 శాతం పెరిగి   33.4 బిలియన్ డాలర్లు  (రూ.2.87 లక్షల కోట్లు) గా రికార్డయ్యాయి. ఒక్క డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  3.77 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం. 

రానున్న నెలల్లో ఇరు దేశాల మధ్య వ్యాపారం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇరు దేశాల మధ్య 93.4 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం (ఎగుమతులు, దిగుమతులు కలిపి) జరిగింది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో చైనా, ఇండియా మధ్య 94.6 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. యూఎస్‌‌‌‌‌‌‌‌–చైనా మధ్య టారిఫ్ వార్ మొదలయ్యే అవకాశం ఉండడంతో యూఎస్‌‌‌‌‌‌‌‌కు  ఇండియా ఎగుమతులు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2021–22 నుంచి ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా యూఎస్‌‌‌‌‌‌‌‌ నిలుస్తోంది. ఇండియా మొత్తం గూడ్స్ ఎగుమతుల్లో ఈ దేశ వాటా18 శాతం ఉంది. ఒకవేళ యూఎస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ట్రంప్ ఇండియా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై సుంకాలు పెంచితే ఇరు దేశాల మధ్య వ్యాపారం దెబ్బతినొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.