ఇండియాలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌‌‌‌

ఇండియాలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌‌‌‌

న్యూఢిల్లీ:  మరో మెగా బాక్సింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వేదికగా వరల్డ్ బాక్సింగ్‌‌‌‌ కప్ ఫైనల్  జరగనుంది. ఈ ఏడాది ఆరంభంలో  వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూబీ) లో చేరిన తర్వాత బాక్సింగ్‌‌‌‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌‌‌‌ఐ) నిర్వహించబోయే తొలి ఇంటర్నేషనల్ టోర్నీ ఇదే కావడం విశేషం. ఈ టోర్నీకి సమాంతరంగా వరల్డ్ బాక్సింగ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ను కూడా బీఎఫ్‌‌‌‌ఐ  నిర్వహించనుంది. ఇందులో వరల్డ్ బాక్సింగ్   ప్రెసిడెంట్‌‌‌‌, ఎగ్జిక్యూటివ్‌‌‌‌ బోర్డు ఎన్నికలు కూడా ఉంటాయి. కాగా,  బీఎఫ్‌‌‌‌ఐ చివరగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్‌‌‌‌తో కలిసి 2023లో వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ నిర్వహించింది.