బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తడబడుతుంది. 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగా ఆరంభంలోనే ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడో ఓవర్ లో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. స్టార్క్ వేసిన అద్భుత బంతికి నాథన్ మెక్‌స్వీనీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో భారత్ 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో యువ బ్యాటర్ పడికల్ పరుగు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 23 బంతుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ 5 పరుగులు చేసి స్లిప్ లో దొరికిపోయాడు. ఈ వికెట్ కూడా హాజిల్‌వుడ్ ఖాతాలోకి వెళ్ళింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టార్క్ కు ఒక వికెట్ దక్కింది.