ఖో ఖో వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా టీమ్స్‌


‌‌‌‌‌‌‌‌న్యూఢిల్లీ: ఖో ఖో వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ ఫైనల్ చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా పురుషుల జట్టు 62-–42 తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటాపోటీగా తలపడ్డాయి. 

చివరి టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడిన ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. విమెన్స్ సెమీస్​లో ఇండియా 66–16తో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి.