వరల్డ్ కప్ లో ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలు సాధిస్తుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోయినా ఆ లోటు కనబడకుండా ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తుంది. అయితే భారత్ జట్టుకు రానున్న మ్యాచుల్లో పాండ్య చాలా కీలకం. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఉంటే మన జట్టు సమతుల్యంగా ఉండడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో మరింత పటిష్టంగా మారుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా హార్దిక్ గాయంపై కీలక అప్ డేట్ వచ్చేసింది.
వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత జరిగిన న్యూజీలాండ్, ఇంగ్లాండ్ మ్యాచులకు దూరమయ్యాడు. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచార ప్రకారం హార్దిక్ గ్రూప్ మ్యాచులన్నిటికీ దూరం కానున్నాడు. అయితే కీలకమైన సెమీ ఫైనల్ కు మాత్రం అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్న ఈ ఆల్ రౌండర్.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
- ALSO READ | ODI World Cup 2023: అప్పుడు బాబర్, ఇప్పుడు బట్లర్: ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్న కుల్దీప్ యాదవ్ స్పిన్
గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. లీగ్ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని.. నవంబరు 15 నాటికి జట్టుతో చేరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. భారత్ మరో మూడు లీగ్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. నవంబర్ 2 న శ్రీలంకతో, నవంబర్ 5 న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 12 న నెదర్లాండ్స్ తో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.