అండర్ 19 వరల్డ్ కప్: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ బోణి కొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన233 పరుగుల టార్గెట్ ను చేధించలేక 187 కే ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 46.5 ఓవర్లలో 232 కు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ యాష్ ధూల్ 82 పరుగులతో రాణించగా..కౌషల్ ధాబ్బే 35, షేక్ రషీద్ 31 చేయడంతో భారత్ 232 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో  మ్యాథ్యూ బోస్ట్ 3, మయాండ, బ్రెవీస్ లకు తలో రెండు,లియామ్, మిక్కీలకు చెరో వికెట్ పడ్డాయి.

తర్వాత 232 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డెవాల్స్ బ్రెవీస్ 65, కెప్టెన్ జార్జ్ వాన్ హీర్ డన్ 36,వాలంటైన్  కే టైమ్ 25  పరుగులు చేయగా మిగతా వారు పెద్దగా రాణించలేదు.దీంతో సౌతాఫ్రికా 187 కు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్వెల్ 5,  రాజ్ భవా 4 వికెట్లు, రాజవర్ధన్ హంగర్గేకర్ ఒక వికెట్ తీశారు.