కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. పస లేని పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. వరుణుడు శాంతించడంతో రిజర్వ్ డే రోజు ఆట తిరిగి ప్రారంభం కాగా, కేఎల్ రాహుల్(72)- విరాట్ కోహ్లీ(57) జోడి టీమిండియాను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు.
ఫహీన్ అష్రఫ్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ మార్క్ చేరుకున్న కేఎల్ రాహుల్(50 నాటౌట్ 60 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్).. అనంతరం దూకుడు పెంచాడు. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ వేసిన 35వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు 55 బంతుల్లో కోహ్లీ.. తన 66వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతానికి 40 ఓవర్లు ముగిసేసరికి.. భారత్ స్కోర్.. 251-2.
FIFTY!
— BCCI (@BCCI) September 11, 2023
A well made half-century by @klrahul in his comeback game as he returns from injury.
Live - https://t.co/Jao6lKkWs5…… #INDvPAK pic.twitter.com/zXlVLpdIvO
That's a fine FIFTY by @imVkohli ??
— BCCI (@BCCI) September 11, 2023
His 66th in ODIs.
Live - https://t.co/kg7Sh2t5pM… #INDvPAK pic.twitter.com/cIiBj7UOqw