IND vs PAK, T20 World Cup 2024: భయపెడుతున్న న్యూయార్క్ పిచ్.. మరో లో స్కోరింగ్ ఖాయమా..?

IND vs PAK, T20 World Cup 2024: భయపెడుతున్న న్యూయార్క్ పిచ్.. మరో లో స్కోరింగ్ ఖాయమా..?

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు. దానికి కారణం ఈ పిచ్ అంచనాలకు అందకపోవడమే.          

వణికిస్తున్న పిచ్ 

ఈ మ్యాచ్‌‌లో ఇరు జట్ల కంటే న్యూయార్క్ స్టేడియంలోని డ్రాప్-ఇన్  పిచ్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్ ఉంది. అనూహ్యంగా స్పందిస్తున్న ఈ వికెట్లపై విమర్శలు వస్తున్నాయి. ఈ స్టేడియంలో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో రెండు సార్లు మాత్రమే 100 ప్లస్‌‌‌‌‌‌‌‌ స్కోరు వచ్చాయి. అనూహ్యమైన బౌన్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. ఈ టోర్నీ కోసం ఇండియా యూఎస్‌‌ వచ్చినప్పటి నుంచి న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోనే ఉండటం. 

ఈ వికెట్ పై మ్యాచ్ అంటే టెస్ట్ క్రికెట్ ను అనే భావన అభిమానుల్లో నెలకొంది. ఇక్కడ జరిగిన మ్యాచ్ ల్లో 120 పరుగులు రావడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఎంతటి ఫామ్ బ్యాటర్లయినా.. బౌలర్ల ధాటికి కుదేలైపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో లో స్కోరింగ్ మ్యాచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్న (జూన్ 8) ఇదే వేదికపై జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 104 పరుగులకు చిత్తయింది. లక్ష్యాన్ని  దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో ఛేజ్ చేసి ఊపిరి పీల్చుకుంది. మరి దాయాదుల మధ్య జరిగే సమరంలో ఎవరు ఆధిపత్యం చూపిస్తారో చూడాలి.