- సెన్సెక్స్ 494 పాయింట్లు డౌన్
- 221 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడంతో గురువారం మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈ సెన్సెక్స్ 494.75 పాయింట్లు తగ్గి 81,006.61 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 595.72 పాయింట్లు పడిపోయి 80,905.64 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 221.45 పాయింట్లు నష్టపోయి 24,749.85 పాయింట్ల వద్ద ఆగింది. బీఎస్ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,03,862.06 కోట్లు తగ్గి రూ. 4,57,25,183.01 కోట్లకు చేరింది.
సెప్టెంబరు క్వార్టర్లో లాభం తగ్గడంతో నెస్లే షేరు ధర 3 శాతానికి పైగా క్షీణించింది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, టాటా స్టీల్, మారుతీ యాక్సిస్ బ్యాంక్ కూడా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ. 3,435.94 కోట్ల విలువైన షేర్లు అమ్మారు