కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా శ్రీలంక మొదట బ్యాటిగ్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో భారత టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీ ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ ఔన్‌షుమాన్ గైక్వాడ్ (71) క్యాన్సర్‌తో దీర్ఘకాలంగా పోరాడుతూ బుధవారం (జూలై 31) మరణించారు. ఇతనికి నివాళి అర్పించడానికి భారత క్రికెటర్లు మైదానంలో నల్ల బ్యాడ్జీలతో కనిపించారు.
'బుధవారం కన్నుమూసిన భారత మాజీ క్రికెటర్, కోచ్ అవున్‌షుమాన్ గైక్వాడ్ జ్ఞాపకార్థంగా టీమ్ ఇండియా ఈరోజు నల్ల బ్యాండ్‌లు ధరించింది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. గైక్వాడ్ ప్రస్తుత వయసు 71 సంవత్సరాలు. భారత్ తరపున 1974 నుంచి 1987 వరకు క్రికెట్ ఆడారు. 40 టెస్టుల్లో 29 యావరేజ్ తో 1985 పరుగులు చేశారు. అతని ఖాతాలో రెండు సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 15 వన్డేల్లో 20 యావరేజ్ తో 269 పరుగులు చేశారు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 201 కాగా.. వన్డేల్లో 78.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ 2024 లో తొలి వన్దే ఆడబోతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలి వన్డే ఆడుతుండడంతో అందరి దృష్టి వీరిపైనే నెలకొంది. ఈ మ్యాచ్ లో తుది జట్టులో రిషబ్ పంత్ కు చోటు లభించలేదు. ముగ్గురు ఆల్ రౌండర్లకు తుది జట్టులో స్థానం దక్కింది. అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్ లతో పాటు దుబేకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. మరో వైపు శ్రీలంక తరపున ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తొలి
Indian team pays tribute to Aunshuman Gaekwad with black armbands today.
— CricketGully (@thecricketgully) August 2, 2024
📸 Sony Liv pic.twitter.com/BhygCzmcnX