అమెరికాలో కాల్పులు .. ఖమ్మం యువకుడు మృతి

  • ఎంబీఏ చదువుతూ స్టోర్‌‌‌‌లో పార్ట్‌‌‌‌టైం జాబ్‌‌‌‌ చేస్తున్న సాయితేజ
  • దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు

ఖమ్మంటౌన్‌‌‌‌, వెలుగు : అమెరికాలోని ఓ స్టోర్‌‌‌‌లో శుక్రవారం తెల్లవారుజామున (అమెరికా కాలమానం ప్రకారం) దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం నగరానికి చెందిన యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నగరంలోని రాపర్తినగర్‌‌‌‌కు చెందిన నూకరపు కోటేశ్వరరావు కుమారుడు సాయితేజ (26) ఇటీవల బీబీఏ పూర్తి చేశాడు. 

ఎంబీఏ కోసం అమెరికాలోని చికాగో సమీపంలో ఉన్న కొంకోడియా యూనివర్సిటీలో చేరాడు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఓ స్టోర్‌‌‌‌లో క్యాషియర్‌‌‌‌గా పార్ట్‌‌‌‌టైం జాబ్‌‌‌‌ చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున కొందరు దుండగులు గన్స్‌‌‌‌తో స్టోర్‌‌‌‌లోకి వచ్చారు. భయాందోళనకు గురైన సాయితేజ క్యాష్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ను వారికి అప్పగించాడు. డబ్బులు తీసుకున్న దుండగులు అనంతరం కాల్పులు జరపడంతో సాయితేజ చనిపోయాడు. దీంతో అక్కడి ఆఫీసర్లకు ఖమ్మంలోని సాయితేజ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువకుడి మృతి వార్త తెలుసుకున్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర  సాయితేజ కుటుంబ సభ్యులకు ఫోన్‌‌‌‌ చేసి పరామర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌‌‌‌ సాయితేజ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులను పరామర్శించారు.