మరాకెచ్ (మొరాకో) : ఇండియా టెన్నిస్ ప్లేయర్లు యూకీ భాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ మరాకెచ్ ఓపెన్, హోస్టన్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్లో ఓడిపోయారు. మరాకెచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అల్బనో ఒలివెటితో కలిసి బరిలోకి దిగిన యూకీ శుక్రవారం రాత్రి జరిగిన సెమీస్ పోరులో 5–7, 6–3, 7–10తో రెండో సీడ్ లూకాస్ మీడ్లెర్–అలెక్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయాడు.
మరోవైపు ఏటీపీ హోస్టన్ ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ (ఇండియా) – ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) కూడా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. సెమీస్‌లో 7–6 (5), 2–6, 3–10తో నాలుగో సీడ్ ఆస్ట్రేలియా ద్వయం మ్యాక్స్ పుర్సెల్–జోర్డాన్ థాంప్సన్ చేతిలో పరాజయం పాలయ్యారు.