ఇందిరమ్మను అమ్మ .. తరువాత ఎన్టీఆర్​ అన్న అయితే .. ఇప్పుడు నేను రేవంత్​ అన్నను..

ఇందిరమ్మను అమ్మ .. తరువాత ఎన్టీఆర్​  అన్న అయితే .. ఇప్పుడు నేను రేవంత్​ అన్నను..

తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి  అసెంబ్లీలో గత బీఆర్​ఎస్​ పాలన.. బీఆర్ఎస్​ నేతల మాటల తీరుపై ఆశక్తికరవ్యాఖ్యలు చేశారు.  మొదట ఇందిరమ్మను అమ్మ అని.. తరువాత ఎన్టీఆర్​ ను అన్నా అని.. ఇప్పుడు తనను రేవంత్​ అన్నా అని ప్రజలు సంబోధిస్తున్నారని  అసెంబ్లీలో అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో సామాన్యులు ముఖ్యమంత్రిని ఏమని సంబోధించాలో కూడా తెలియని పరిస్థితి ఉండేది.  

 గతంలో బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్​  ఎక్కడికైనా వస్తున్నారంటే కనీసం గంట ముందే ఎక్కడికక్కడ బంద్ చేసేవారు. కనీసం ఆయన్ను కలవాలంటే కూడా సాధ్యపడదు. ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం కూడా దొరకదు. కానీ.. అప్పుడూ సీఎం అంటే అలా ఉండేదేమో కానీ.. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చాడంటూ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. 

ALSO READ | 32 సార్లు ఢిల్లీ వెళ్లా.. భవిష్యత్ లో 300 సార్లు వెళ్తా : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు ( మార్చి 15) సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ( మార్చి 15) అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేత.. కేసీఆర్​ మోహం చాటేశారని.. గవర్నర్​ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానంపై చర్చ పెడితే  బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీష్​ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.  బీఆర్​ఎస్​ హయాంలో తప్పులు.. అప్పులు చేసి ప్రజలను ముంచేశారని సీఎం రేవంత్​ తెలిపారు.  తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారని సీఎం రేవంత్​ అన్నారు.