- టీపీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులను మినహాయించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం టీపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజనకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.
పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మృతిచెందిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషీయా చెల్లించాలని కోరారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీపీఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ సందీప్ పాల్గొన్నారు.