ఇందిరమ్మ ఇళ్లకుఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్​

ఇందిరమ్మ ఇళ్లకుఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్​
  • పైలట్ గ్రామాల్లో బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిర్మించిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష జమ
  • అన్ని గ్రామాల్లో ఊపందుకున్న పనులు 
  • ఉమ్మడి జిల్లాలో 6,416 ఇళ్లు మంజూరు 
  • 252 మందికి రూ.2.52 కోట్లు శాంక్షన్​

కరీంనగర్, వెలుగు: ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో బేస్ మెంట్ లెవల్ వరకు నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత సాయం అందిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇప్పటికే 252 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.52 కోట్లు జమ చేసింది.  అధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలిస్తూ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తూ లబ్ధిదారులకు త్వరగా సాయం అందేలా చూస్తున్నారు. బేస్ మెంట్ లెవల్ వరకు ఇల్లు నిర్మించిన వారం రోజుల్లోనే డబ్బులు జమ కావడంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

దీంతో మిగతావారు కూడా తమ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గోడలు నిర్మించాక 1.25 లక్షలు, స్లాబ్ వేశాక రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష సాయం కలిపి  మొత్తం రూ.5 లక్షల సాయం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది.

ఉమ్మడి జిల్లాలో 6,416 ఇండ్లు మంజూరు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 గ్రామాలను ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా 6,416 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలోని 15 గ్రామాలకు 2,027 ఇండ్లు, జగిత్యాల జిల్లాలోని 20 గ్రామాలకు 1426, పెద్దపల్లి జిల్లాలో 13 గ్రామాలకు 1940, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 గ్రామాలకు 1023 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 702 ఇండ్లకు ముగ్గుపోయగా బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు 85 ఇండ్లు పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాలో 351 ఇండ్లకు ముగ్గుపోయగా, 136 బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్ వరకు పూర్తయ్యాయి. వీరిలో 32 మందికి రూ.లక్ష చొప్పున జమయింది. మిగతావారికి ఆర్థిక సాయం అందాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో 623 ఇండ్లకు ముగ్గు పోయగా, 111 ఇండ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 313 ఇళ్లకు ముగ్గుపోయగా 41 ఇండ్లు బేస్ మెంట్ వరకు పూర్తవ్వగా 24 మంది లబ్ధిదారులకు రూ. లక్ష సాయం అందింది. 

ఇల్లు నిర్మిస్తేనే బిల్లులు.. గతంలో ఇళ్లు నిర్మించకపోయినా.. 

బినామీల పేరుతో బిల్లులు డ్రాచేసుకున్న ఘటనలు అనేకం జరిగాయి. కానీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇళ్లకే బిల్లులు మంజూరయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.  పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జియో ట్యాగింగ్ చేయడంతోపాటు అక్షాంశ, రేఖాంశాలతో కూడిన ఫొటోలను పంచాయతీ సెక్రటరీలు తొలుత అప్ లోడ్ చేస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా ఏఈలు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి స్వయంగా పరిశీలించి అక్కడి నుంచే అప్రూవ్ చేస్తున్నారు. ఇంటి నిర్మాణం 400 స్క్వేర్​ఫీట్స్ నుంచి 600 స్క్వేర్​ఫీట్స్ మధ్యే ఉండేలా చూసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు.