
- బస్సు పై బీర్ బాటిల్ తో దాడి.. మహిళకు గాయాలు
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలో నేషనల్ హైవే పై శుక్రవారం మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. గుంటూరు నుంచి ప్రయాణికులతో కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపైకి నాగబాబు అనే వ్యక్తి బీరు సీసా విసిరాడు.
బస్సులోని అన్నమయ్య జిల్లా కలికిరి గ్రామానికి చెందిన రాజేశ్వరికి బీరు సీసా తగిలి కంటి పక్కన గాయమైంది. తోటి ప్రయాణికులు బాధితురాలును పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగబాబుపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.