ఎమ్మార్పీఎస్ మందకృష్ణకు గాయాలు

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కు గాయాలయ్యాయి. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో దిగారు. ఆయన బాత్ రూమ్ లో జారిపడడంతో గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయనను చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎట్లా జరిగింది.. ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. జారిపడడం వల్ల అయిన సాధారణ గాయాలేనా.. లేక మరేదైనా అనారోగ్య సమస్యలా ? ఆయన పరిస్థితి ఎలా ఉందన్న వివరాలు తెలియరాలేదు.