హర్యానాలో ఘోరం జరిగింది. ఐఎన్‌ఎల్‌డి చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఆదివారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో రాథీతో పాటు మరొక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఎన్‌ఎల్‌డి చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ పై హర్యానాలోని బరాహి గేట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు.
రిథీ మెడ, నడుము, తొడలపై అనేక బుల్లెట్లు దించారని అన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బందికి కూడా పలు బుల్లెట్లు తగిలాయని నిందితుల కోసం ఎస్టీఎఫ్, సీఐఏ బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. “కాల్పుల ఘటనకు సంబంధించి మాకు సమాచారం అందింది. సీఐఏ, ఎస్టీఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం' అని ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ తెలిపారు.
#WATCH | Bahadurgarh: Visuals from the spot where an alleged attack on Haryana INLD chief Nafe Singh Rathee took place.
— ANI (@ANI) February 25, 2024
Jhajjar SP Arpit Jain says, "We received information regarding an incident of firing. CIA and STF teams are working. The accused will be arrested soon..." pic.twitter.com/ttDADxuLef