- ఆన్ లైన్ లో యువత రక్షణ కోసం పేరెంట్స్ గైడ్
- ఉజ్వల భవిష్యత్తుకోసం ఎంచుకునే మార్గాలు
- నేరగాళ్లతో ప్రమాదాలను ఎలా కాపాడుకోవాలి
- పిల్లల భద్రతకు ఉన్న ఫీచర్ల వివరాలతో గైడ్
- అకౌంట్ హ్యాక్ అయితే తమను తాము రక్షించుకునే పద్ధతులపై అవగాహన కల్పించనున్న గైడ్
హైదరాబాద్: యువతకు భద్రతనందించడం కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇవాళ తెలుగు భాషలో పేరెంట్స్ గైడ్‌ను విడుదల చేసింది. తల్లిదండ్రులు సులభంగా నేర్చుకునేలా ఈ గైడ్ రూపొందించారు. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న అన్ని భద్రతా ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించడం ద్వారా యువత సురక్షితంగా ఉండటంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుంది ఈ గైడ్.
మారుతున్న డిజిటల్ వాతావరణాన్ని అత్యుత్తమంగా అర్థం చేసుకోవడంలో ఇది తల్లిదండ్రులకు సహాయ పడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌పై తమ చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడే ఉపకరణాలను గురించిన సమాచారం సైతం అందిస్తుంది. ఈ గైడ్‌లో చిన్నారుల హక్కులు మరియు భద్రతపై అతి చురుకుగా పనిచేస్తోన్న కీలక సంస్థలు అందించిన సమాచారం అలాగే భద్రతా ఫీచర్లకు సంబంధించిన సమాచారం సైతం అందుబాటులో ఉంది.
క్రియేటర్ మరియు బిజినెస్ ఎక్కౌంట్స్ తమకు ఎవరు మెసేజ్‌లను ఇన్‌స్టాగ్రామ్‌పై పంపించాలో నియంత్రించుకోవడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్‌పై ఎవరు తమను గ్రూప్‌లలోకి జోడించవచ్చో కూడా నిర్ణయించేకునేందుకు తోడ్పడే ‘డీఎం రీచబిలిటి కంట్రోల్స్’ కూడా ఉంది. మరో ఉదాహరణ, ‘బల్క్ కామెంట్ మేనేజ్‌మెంట్’, ఇది ప్రజలకు కామెంట్‌లను బల్క్‌గా తొలగించే అవకాశం అందిస్తుంది. అలాగే నెగిటవ్ కామెంట్లను పోస్ట్ చేసిన ఖాతాలను బ్లాక్ చేయడం లేదా పలు ఖాతాలను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. దీనిలో ‘రిస్ట్రిక్ట్’ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది మీ చిన్నారి, ఆకతాయిలకు తెలీకుండానే తమ ఖాతాలను అవాంఛిత సంభాషణల నుంచి కాపాడుకునేందుకు తోడ్పడుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ ఇండియా పబ్లిక్ పాలసీ అండ్ కమ్యూనిటీ ఔట్‌రీచ్ మేనేజర్ తారాబేడీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న నేపధ్యంలో తల్లిదండ్రులకు తమ పిల్లలు వినియోగిస్తున్న ఉత్పత్తులు మరియు ఫీచర్లను గురించి పూర్తి సమాచారం ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ అవగాహన తల్లిదండ్రులు మరింత సౌకర్యం అనుభవించేందుకు తోడ్పడుతుందన్నారు. తమ వేదికపై సురక్షిత మరియు మద్దతుతో కూడిన వాతావరణం అందించే దిశగా వేసిన మరో ముందడుగుగా నిలుస్తుందని ఆమె వివరించారు. యువత భద్రతను మెరుగుపరిచేందుకు ఇన్‌స్టాగ్రామ్ పలు ఇతర మార్పులను సైతం ప్రకటించిందని, అలాగే నూతన ఫీచర్ సెక్యూరిటీ చెకప్ ఉందన్నారు. దీనిద్వారా ఎవరి ఖాతా అయినా హ్యాక్ అయినప్పుడు తమను తాము రక్షించుకునేందుకు అనుసరించాల్సిన విధానాలను గురించి మార్గనిర్దేశకత్వం చేస్తారు.