కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రైవేట్‌కు దీటుగా రిజల్ట్స్ సాధించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్, సెక్రటరీ ఎస్.కృష్ణ ఆదిత్య సూచించారు. బుధవారం సిటీలోని గవర్నమెంట్ గర్ల్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్‌కు 3 నెలల టైం మాత్రమే ఉందని, దీనికి అనుగుణంగా ప్రణాళిక రెడీ చేసుకోవాలన్నారు.
అబ్సెంట్ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలన్నారు. అనంతరం ఎస్జీఎఫ్ క్రీడల్లో విజయం సాధించిన స్టూడెంట్లకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో డీఐఈవో జి.జగన్ మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్యవర్ధన్‌రావు, నిర్మల, లెక్చరర్లు పాల్గొన్నారు.