సెల్ ఫోన్ లో గేమ్ ఆడొద్దన్నందుకు ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

సెల్ ఫోన్ లో గేమ్ ఆడొద్దన్నందుకు ఇంటర్ స్టూడెంట్ సూసైడ్
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో ఘటన 

బెల్లంపల్లి, వెలుగు: సెల్ ఫోన్‌లో గేమ్ ఆడొద్దని తండ్రి మందలించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. తాళ్లగురిజాల ఎస్ఐ  చుంచు రమేశ్​ తెలిపిన ప్రకారం..  బెల్లంపల్లి మండలం పెర్కపల్లికి చెందిన  మోటపలుకుల మనోజ్ కుమార్ (18) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

 ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ కొనసాగుతుండగా ఒకటి రాశాడు. ఇంట్లో సెల్ ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా వద్దని తండ్రి స్వామి మందలించాడు. దీంతో మనోజ్ కుమార్ మనస్తాపం చెంది   పురుగుల మందు తాగాడు. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.