ఓల లో అలరించిన కుస్తీ పోటీలు

 ఓల లో అలరించిన కుస్తీ పోటీలు
  • తరలి వచ్చిన అంతరాష్ట్ర మల్ల యోధులు

కుంటాల, వెలుగు:  నిర్మల్ జిల్లా  కుంటాల మండలంలోని ఓల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అంతరాష్ట్ర కుస్తీ పోటీలు అలరించాయి.  మహా శివరాత్రి జాతర ముగింపు ఉత్సవాల్లో భాగంగా  ప్రాచీన శివాలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలను మాజీ మంత్రి అల్లోల పీఏ నాలం  శ్రీనివాస్ ప్రారంభించారు.

 కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు వివిధ జిల్లాల నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీల్లో తలపడ్డారు. ఫైనల్ విజేత నాందేడ్ సాయినాథ్ కు రూ.5 వేల నగదు అందజేశారు.  జాతరకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు ఎగ్గం నర్సింలు, ఆలయ కమిటీ  అధ్యక్షుడు మెదరి గణపతి, స్థానిక నాయ కులు శ్రీనివాస్ గౌడ్, పాషా, ప్రభాకర్, బంజ దేవిదాస్,అశోక్ కుమార్, వేముల సాయి, నరేశ్ పాల్గొన్నారు.