మొబల్స్ సిగ్నల్స్ కోసం ఇంట్రా సర్కిల్​ రోమింగ్​ సర్వీస్​

మొబల్స్ సిగ్నల్స్ కోసం ఇంట్రా సర్కిల్​ రోమింగ్​ సర్వీస్​

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్​ సరిగ్గా అందవు. మనం వినియోగించే నెట్​వర్క్ కాకుండా వేరే నెట్​వర్క్​ సిగ్నల్​ ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్​ రోమింగ్(ఐసీఆర్) సర్వీస్​ను కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించింది. గ్రామీణ మొబైల్​ నెట్​వర్క్​ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్​ భారత్​ నిధి(డీబీఎన్) కార్యక్రమంలో భాగంగా 35 వేల గ్రామాలకు మొబైల్​ నెట్​వర్క్ ఉండేలా 27వేల మొబైల్​టవర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ డీబీఎన్​ను టెలికాం యాక్ట్​ – 2023 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 ఇప్పటివరకు డీబీఎన్​ నిధులతో ఏ కంపెనీ అయితే టవర్​ను ఏర్పాటు చేస్తుందో ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే సిగ్నల్స్ అందేవి. ఇప్పుడు ఈ ఐసీఆర్ ద్వారా డీబీఎన్​ నిధులతో ఏర్పాటైన టవర్ల నుంచి బీఎస్​ఎన్​ఎల్, జియో, ఎయిర్​టెల్​ నెట్​ వర్క్​ వినియోగదారులందరికీ మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ సేవలు అందుతాయి. డీబీఎన్​ టవర్ల పరిధిలో మనం వినియోగించే నెట్​వర్క్​ సిగ్నల్​ లేకపోతే మన ఫోన్​ ఆటోమేటిక్​గా అక్కడ ఉండే నెట్​వర్క్​కు మారిపోయే సదుపాయం కూడా రానున్నది.