
కేంద్రంలోని ప్రతిపక్ష ఎంపీలకు ఐ ఫోన్ల యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
విపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మెసేజ్ ను చూపించారు. అయితే విపక్షాల ఆరోపణలపై స్వయంగా యాపిల్ సంస్థే స్పందించింది. ఆ అలర్ట్ తాము పంపలేదని, ఒక్కోసారి ఫాల్స్ అలార్మ్ కూడా కావొచ్చని, అటాకర్లను గుర్తించలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ రాజకీయాల్ని కుదిపివస్తోంది.
ఆపిల్ సంస్థ 150 దేశాల్లోని తమ యూజర్లకు థ్రెట్ అలెర్ట్ నోటిఫికేషన్ పంపించిందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. తమ ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలపై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ( అక్టోబర్ 31) స్పందించారు అయినప్పటికీ ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలను దర్యాప్తు చేయాలని ఆదేశించామని కేంద్ర సమాచార శాఖా మంత్రి తెలిపారు. . ఈ విషయంపై కేంద్ర ఆందోళన చెందుతోందని, అయితే ఈ అలెర్ట్ మెసేజ్ లో 150 దేశాల్లోని ప్రజలకు వచ్చాయని తెలిపారు.
కేసు సాంకేతిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఏజెన్సీలు, నిఘా సంస్థలను ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఆపిల్ నుంచి తమకు కూడా హెచ్చరికలు వచ్చాయని కొందరు ఎంపీలు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు 150 దేశాల్లోని ప్రజలకు యాపిల్ ఈ హెచ్చరిక నోటిఫికేషన్లను పంపింది.
యాపిల్ వివరణ
హ్యాకింగ్ ప్రయత్నాలపై యాపిల్ సంస్థ స్పందించింది. తమ అలర్ట్ మెసేజ్ ఏ దేశాన్ని ఉద్దేశించి పంపలేదని పేర్కొంది. వాస్తవానికి 150కి పైగా దేశాల్లో తమ వినియోగదారులకు థ్రెట్ నోటిఫికేషన్లు యాపిల్ సంస్థ పంపినట్లు నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కోసారి ఫాల్స్ అలార్మ్ కూడా కావొచ్చని, అటాకర్లను గుర్తించలేమని సంస్థ పేర్కొంది. ప్రభుత్వాల ప్రోద్భలంతో జరిగే దాడులకు నిధులు, అధునాతన పరిజ్ఞానం ఉంటుందని, థ్రెట్ అలర్ట్ నోటిఫికేషన్ల జారీ వెనుక కారణమేంటో మేం స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడం కూడా సాధ్యం కాదని యాపిల్ పేర్కొంది.
దేశం పురోభివృద్ధిని చూడకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష ఎంపీలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేంద్రమంత్రి వైష్ణవ్ మండిపడ్డారు. కాగా.. తమకు ఆపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్లు వచ్చాయని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, పవన్ ఖేరా సహా ప్రతిపక్ష నేతలు వెల్లడించారు. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా బయటకు తీసుకొచ్చారు.
#WATCH | On multiple opposition leaders allege 'hacking' of their Apple devices, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says "From the mail sent by from Apple, it can be understood that they have no clear information, they have sent alerts on the… pic.twitter.com/hSxOJicbwV
— ANI (@ANI) October 31, 2023
యాపిల్ ఐఫోన్లను హ్యాక్(iPhone Hacking) చేస్తున్నారని కొందరు విపక్ష ఎంపీలు ఫిర్యాదు చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొంత మంది ఎంపీలు తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు ఎంపీలు చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో సమగ్ర దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిల్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. విమర్శకులకు ఎటువంటి ఇష్యూ లేని సమయంలో.. వాళ్లు కేవలం నిఘా గురించి మాట్లాడుతుంటారని, కొన్నేళ్ల క్రితం కూడా వాళ్లు ఇదే ప్రయత్నం చేశారని, గతంలోనూ విచారణ చేపట్టామని, న్యాయవ్యవస్థ సూపర్‌విజన్‌లోనే ఆ దర్యాప్తు సాగిందని మంత్రి తెలిపారు.
రాహుల్ గాంధీ ఏమన్నారు?
విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోదీ ప్రాణం అదాని చేతిలో ఉంది. అదానీ కోసమే మోదీ పని చేస్తున్నారు. అదానీకి మోదీ ఉద్యోగి మాత్రమే. ఇంత కాలం మోదీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2 అనుకున్నాం. కానీ అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2 అని తెలిసింది. ఎంత ట్యాపింగ్ చేసినా భయపడం. కావాలంటే నా ఫోనే ఇస్తా. యువతకు న్యాయం జరగనంత వరకు దేశం అభివృద్ధి చెందదు. కులగణనతోనే యువతకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం అదానీకి దోచి పెడుతోంది. విద్యుత్, రైలు, ఫ్లైట్ ఇలా అన్నింట్లోనూ అదాని టాక్స్ వసూలు చేస్తున్నారు’’ అని అన్నారు.
బీజేపీ సమాధానం
ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పని, ఇది ఎలాంటి సందేశమో .... యాపిల్ సంస్థను వివరణ కోరాలని, కంపెనీ స్పందనపై అసంతృప్తిగా ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఈ నేతలను ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ సందేశం ఏమిటి. ఇది ఎందుకు పంపబడింది, ఆపిల్ కంపెనీ మాత్రమే దీని గురించి స్పష్టత ఇవ్వగలదు. ఐటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీకి స్వయంగా శశి థరూర్ చైర్మన్‌గా ఉన్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రసాద్ వ్యంగ్యంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ తన ఫోన్‌పై పెగాసస్ గూఢచర్యం చేస్తున్నారని ... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినట్లు అనిపించిందని, అయితే సుప్రీం కోర్టు తనను కోరినప్పుడు దర్యాప్తు కోసం తన ఫోన్‌ను విచారణ కమిటీకి ఇవ్వండి అని తెలిపిందని, ఆయన ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి పేర్కొన్నారు.
Also Read :- సానియా మీర్జా క్రిప్టిక్ పోస్ట్..దుబాయ్‌లో గ్రాండ్‌గా కొడుకు పుట్టిన రోజు వేడుకలు