
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు (246): జూనియర్ ఆపరేటర్ గ్రేడ్–1 (215), జూనియర్ అటెండెంట్గ్రేడ్–1 (23), జూనియర్ బిజినెస్ అసిస్టెంట్గ్రేడ్–3(08) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 2025, జనవరి 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు సడలింపు ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.