ప్రస్తుత ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమి పాలయ్యారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన.. ఆ తరువాత పుంజుకొని పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో వరుస ఓటములు చవిచూసింది. దీంతో ఆర్‌సీబీ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
కోహ్లీ ఒక్కడే..
జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉండేది వాస్తవం అయినప్పటికీ.. ఆర్‌సీబీ జట్టులో ఆడేది మాత్రం ఏ ఇద్దరు.. ముగ్గురు మాత్రమే. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కడు స్థిరంగా రాణిస్తుండగా.. రజిత్ పటీదార్, మహిపాల్ లామ్రోర్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ అడపాదడపా రాణిస్తున్నారు. కోహ్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 203 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి బెస్ట్ బ్యాటర్ అంటే 90 పరుగులు దినేష్ కార్తీక్. ఈ గణాంకాలను బట్టి ఆ జట్టు కోహ్లీపై ఎంతలా ఆధారపడుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఒత్తిడి ఎక్కువ అవుతోంది
కోహ్లీ స్థిరంగా రాణిస్తున్నప్పటికీ.. అతనిపై ఒత్తిడి ఎక్కువ అవుతోందని ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి వారు అతనికి సహాయ పడాలని సూచించాడు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ (బ్యాటర్లు) విరాట్‌కు సహాయం చేస్తేనే ఫలితాలు ఆర్‌సీబీకి అనుకూలంగా వస్తాయని చెప్పుకొచ్చాడు.
విరాట్ అద్భుతం
అదే సమయంలో కోహ్లీ స్ట్రైక్-రేట్‌కు సంబంధించి వస్తున్న విమర్శలను స్మిత్ కొట్టిపారేశాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవడంలో కోహ్లీకి మరే ఆటగాడు సాటిరారని ఆసీస్ క్రికెటర్ తెలిపారు. విరాట్ నమ్మశక్యం కాని ఆటగాడని కితాబిచ్చాడు. ప్రతి మైదానంలో 180 స్ట్రైక్-రేట్ అవసరం లేదని 150-160 సరిపోవచ్చుని.. పరిస్థితిని బట్టి విరాట్ ఆడుతున్న అని స్మిత్ జోడించాడు.
ఇన్నింగ్స్‌లను గమనించాలని విమర్శకులకు బుద్ధిచెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ తో పోరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 06న జైపూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో విధ్వంసకర ఓపెనర్ విల్ జాక్స్ ను పరీక్షించాలని యాజమాన్యం భావిస్తోంది.
Time to take off, in every sense. Bon voyage! ✈️
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 4, 2024
Khamma Ghani, Jaipur! 👋#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/1LMMyrOeMl