బీసీసీఐ స్పెషల్ ప్లాన్..మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2024

బీసీసీఐ స్పెషల్ ప్లాన్..మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2024

భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ గురించి బీసీసీఐ కీలక అప్ డేట్ ఇవ్వనుంది. నివేదికల ప్రకారం మార్చ్ 22 నుంచి మే 26 వరకు ఈ మెగా టోర్నీ జరిపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో ఈ పొట్టి సమరానికి ఒక వారం రోజులు ముందుగానే ఐపీఎల్ కు ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తోందట. అధికారిక సమాచారం మరో రెండు రాజుల్లో రానుంది. 
  
వరల్డ్ కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ ను జూన్ 5 న ఐర్లాండ్ తో ఆడనుంది. ఐపీఎల్  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫిబ్రవరి 22 నుండి మార్చి 17 వరకు జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ బెంగళూరు, ఢిల్లీ వేదికలుగా జరపాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ లీగ్‌ని ఇండియాలోనే జరపాలని బీసీసీఐ తీవ్రంగా కృషి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 మరియు 2014లో వరుసగా రెండు పర్యాయాలు IPL విదేశాలకు తరలించబడింది.

2009లో ఐపీఎల్ రెండో సీజన్ దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. 2014 లో ప్రారంభ మ్యాచ్ లను UAEలో.. మిగిలిన మ్యాచ్ లను ఇండియాలో నిర్వహించారు. 2019 లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని మాత్రం భారత్ లోనే నిర్వహించారు. ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు టీ20 వరల్డ్ కప్ ఉండడటంతో బీసీసీఐ ఐపీఎల్ 2024 షెడ్యూల్ ను ఎలా ప్లాన్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది.