
- రాణించిన అభిషేక్, రాహుల్, స్టబ్స్, అక్షర్..
- జైస్వాల్, నితీశ్ పోరాటం వృధా
న్యూఢిల్లీ: ఐపీఎల్–18లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపై బోణీ చేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. అభిషేక్ పోరెల్ (37 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), కేఎల్ రాహుల్ (32 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), ట్రిస్టాన్ స్టబ్స్ (18 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), అక్షర్ పటేల్ (14 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) రాణించడంతో టాస్ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 188/5 స్కోరు చేసింది.
తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 188/4 స్కోరే చేసింది. యశస్వి జైస్వాల్ (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), నితీశ్ రాణా (28 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలు సాధించారు. ఇరుజట్ల స్కోరు సమం కావడంతో నిర్వహించిన సూపర్ ఓవర్‌లో ముందుగా రాజస్తాన్ 11/2 స్కోరు చేయగా, డీసీ 13/0తో ఈజీగా నెగ్గింది. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
అక్షర్, స్టబ్స్ జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా పోరాడారు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లతో మెక్‌గుర్క్ (9) దూకుడు మొదలుపెడితే, రెండో ఓవర్‌లో అభిషేక్ 4, 4, 6, 4, 4తో 23 రన్స్ దంచాడు. కానీ ఐదు బాల్స్ తేడాలో మెక్‌గుర్క్, కరుణ్ నాయర్ (0) ఔట్ కావడంతో డీసీ 34/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన రాహుల్ కొద్దిసేపు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పవర్‌ప్లేలో డీసీ 46/2 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో సిక్స్‌తో గాడిలో పడితే, అభిషేక్ నెమ్మదించాడు. దీంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 30 రన్సే రావడంతో ఫస్ట్ టెన్‌లో స్కోరు 76/2గా మారింది. 11వ ఓవర్‌లో రెండో సిక్స్‌తో జోరు పెంచిన రాహుల్‌ను 13వ ఓవర్‌లో ఆర్చర్ (2/32) ఔట్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 63 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
స్టబ్స్ వచ్చీ రావడంతోనే సిక్స్‌తో జోష్ పెంచినా, 14వ ఓవర్‌లో అభిషేక్ వెనుదిరిగాడు. ఈ టైమ్‌లో వచ్చిన అక్షర్ పటేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 16వ ఓవర్‌లో అక్షర్ 4, 4, 6తో 19 రన్స్ దంచగా, స్టబ్స్ ఇచ్చిన క్యాచ్‌ను పరాగ్ డ్రాప్ చేశాడు. 17వ ఓవర్‌లోనూ 6, 4, 4 కొట్టిన అక్షర్ ఆఖరి బాల్‌కు ఔట్ కావడంతో ఐదో వికెట్‌కు 41 రన్స్ జతయ్యాయి. 18వ ఓవర్‌లో ఏడు రన్సే వచ్చినా, 19వ ఓవర్‌లో స్టబ్స్, అశుతోష్ (15 నాటౌట్) మూడు ఫోర్లు కొట్టారు. లాస్ట్ ఓవర్‌లో స్టబ్స్ 6, 4 దంచాడు. ఆరో వికెట్‌కు 42 రన్స్ రావడంతో 15 ఓవర్లలో 111/4గా ఉన్న స్కోరు 188/5కి చేరింది.
జైస్వాల్, నితీశ్ ధనాధన్..
ఛేజింగ్‌లో రాజస్తాన్ ఓపెనర్ శాంసన్ (31) రెండో ఓవర్‌లోనే రెండు సిక్స్‌లతో జోరు పెంచితే... మూడో ఓవర్‌లో జైస్వాల్ 4, 6, 4తో డబుల్ చేశాడు. తర్వాత మరో 6, 4 కొట్టిన శాంసన్ ఐదో ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను అశుతోష్ డ్రాప్ చేశాడు. ఆరో ఓవర్‌లో 4, 6 బాదిన శాంసన్ రిటైర్డ్‌గా వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో రాయల్స్ 63/0 స్కోరు చేసింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (1/23), విప్రాజ్ నిగమ్ రన్స్ కట్టడి చేసినా.. కుల్దీప్ (1/33) ఎనిమిదో ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ ఇచ్చుకున్నాడు. అయితే 9వ ఓవర్‌లో అక్షర్.. పరాగ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో స్కోరు 76/1గా మారింది. ఈ దశలో జైస్వాల్ 6, 4తో జోరు తగ్గకుండా చూడగా, నితీశ్ రాణా ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు.
ఫస్ట్ టెన్‌లో రాజస్తాన్ 94/1 స్కోరుతో నిలిచింది. 34 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్ 14వ ఓవర్‌లో కుల్దీప్‌కు వికెట్ ఇవ్వడంతో 36 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి నితీశ్ 6, 4, 4, 6, 4, 4 తో 26 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టాడు. కానీ 18వ ఓవర్‌లోనే ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 49 రన్స్ జతయ్యాయి. చివర్లో ధ్రువ్ జురెల్ (26), హెట్‌మయర్ (15 నాటౌట్) విజయానికి 28 రన్స్ అవసరం కాగా, 27 రన్సే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. లాస్ట్ ఓవర్‌లో 9 రన్స్ కావాల్సి ఉండగా స్టార్క్ అద్భుతంగా కట్టడి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 188/5 (అభిషేక్ 49, స్టబ్స్ 34*, అక్షర్ 34, ఆర్చర్ 2/32).
రాజస్తాన్: 20 ఓవర్లలో 188/4 (జైస్వాల్ 51, నితీశ్ రాణా 51, అక్షర్ పటేల్ 1/23).