స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్వల్ప ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే సోమవారం ( అక్టోబర్ 16) వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, అంగళ్లు కేసులో ( అక్టోబర్ 12)రేపటి వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కాగా, ఏపీలో సంచలనం సృష్టించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో పోలీసులు చంద్రబాబును నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో ఆయనను హైకోర్టు ఆశ్రయించారు. ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చంద్రబాబుకు స్వల్ప ఊరట కల్పించింది. ఐఆర్ఆర్ కేసులో వచ్చే సోమవారం ( అక్టోబర్ 16) వరకు, అంగళ్లు కేసులో రేపటి( అక్టోబర్ 12) వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: ఏంటయ్యా ఇదీ : సీఎం జగన్ పౌష్ఠికాహారం ఖర్జూరంలో చనిపోయిన పాము