- ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్
(ఐఎస్ఏ) ఏడో జనరల్ అసెంబ్లీ ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. ఇందులో ఐఎస్ఏ ప్రెసిడెంట్గా మళ్లీ భారత్ ఎన్నికయింది. వైస్ ప్రెసిడెంట్ పదవికి ఫ్రాన్స్ ఎన్నికయింది. ఈ దేశాలు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నాయి. ఐఎస్ఏకి సంబంధించి స్టాండింగ్ కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ స్థానాలును కూడా భర్తీ చేశారు.
ఆఫ్రికా ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా ఘనా, సీషెల్స్ ఎన్నిక కాగా, వాటికి సహకరించే వైస్ చైర్ దేశాలుగా దక్షిణ సూడాన్, కామెరాన్ ఎన్నికయ్యాయి.
ఆసియా పిసిఫిక్ ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా ఆస్ట్రేలియా, శ్రీలంక, వైస్ చైర్స్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పపువా న్యూగినియా ఎన్నికయ్యాయి.
యూరప్ ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా గ్రీస్, నార్వే, వైస్ చైర్స్గా జర్మనీ, ఇటలీ దేశాలు ఎన్నికయ్యాయి.
దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా గ్రెనెడా, సురినామ్, వైస్ చైర్స్గా జమైకా, హైతీలు ఎన్నికయ్యాయి.
ఐఎస్ఏ డీజీగా ఆశీష్ ఖన్నా ఎన్నికయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ వచ్చే ఫిబ్రవరిలో పదవీ విరమణ అనంతరం ఆశీష్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.
అంతర్జాతీయ సౌర కూటమి
భూమధ్యరేఖకు ఇరువైపుల ఉన్న ఉష్ణమండల దేశాలన్నీ సంయుక్తంగా సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2015లో ఫ్రాన్స్, భారత్లు కలిసి కాప్ 21 సదస్సులో ఈ కూటమిని ప్రారంభించాయి.
- ప్రధాన కార్యాలయం: హర్యానా (గురుగ్రామ్)
- సభ్యదేశాలు: 121 దేశాలు
ప్రధాన లక్ష్యాలు: 2030 నాటికి 1000 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం, 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యారవణ శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్ల ఉద్గారాలను తగ్గించడం.