బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. చాలా మంది గాయాలపాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది అంతస్తుల బిల్డింగ్పూర్తిగా నేలమట్టమయింది. లెబనాన్ సివిల్ డిఫెన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు స్పాట్‌కు చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. అయితే, మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని పోలీసులు పేర్కొన్నారు.
అలాగే, డ్రోన్ స్ట్రైక్‌లో దక్షిణ ఓడరేవు నగరం టైర్‌లో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారని ప్రభుత్వ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. కాగా, ఈ వారంలో లెబనీస్ రాజధానిపై బీరుట్‌పై ఇజ్రాయెల్దాడులకు పాల్పడడం ఇది నాలుగోసారి. బీరుట్‌లోని దక్షిణ శివార్లలో హిజ్బుల్లా బలమైన స్థావరమైన దహియేహ్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సైన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దాడులకు ముందే ఆ ప్రాంతంలోని పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు వెల్లడించింది.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య 13 నెలలకు పైగా జరిగిన పోరాటాన్ని ముగించడానికి కాల్పుల విరమణ ఒప్పందాదానికి మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నంలో యూఎస్ రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ ఈ వారం ఈ ప్రాంతానికి వెళ్లిన తర్వాత దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్టోబరు 7, 2023న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మందిని చంపి, చాలా మంది పౌరులు, మరో 250 మందిని కిడ్నాప్ చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా స్ట్రిప్‌లో జరిగిన పోరాటంలో మరణించిన వారి సంఖ్య ఈ వారంలో 44 వేలు దాటిందని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నట్టు పేర్కొన్నారు.